మళ్ళీ ఈ పెళ్లి సందడి మరో సంచలనం అవ్వాలి – అనిల్ రావిపూడి

Published on Jul 30, 2021 7:30 pm IST

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు బీఎ గారు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎందరో నటీనటులను సినిమా పరిశ్రమ కి పరిచయం చేశారు. అయితే ఇప్పుడు నటుడు గా పెళ్లి సందడి లో నటించడం పై ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యం లో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయం పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకాలం కెమెరా వెనుక నుండి చూపించిన దర్శకేంద్రుడి మాయ ఇప్పుడు కెమెరా ముందు చూడబోతున్నాం అని అన్నారు. గురూజీ, మళ్ళీ ఈ పెళ్లి సందడి మరో సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అంతేకాక చిత్రం యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :