జంధ్యాల కామెడీతో రియల్ మెన్ ఛాలెంజ్ పూర్తి చేసిన మహేష్ డైరెక్టర్

జంధ్యాల కామెడీతో రియల్ మెన్ ఛాలెంజ్ పూర్తి చేసిన మహేష్ డైరెక్టర్

Published on Apr 24, 2020 8:05 PM IST

విక్టరీ వెంకటేష్ రియల్ మెన్ ఛాలెంజ్ స్వీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో పూర్తి చేశారు. జంధ్యాల గారి సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు చెప్పే సుదీర్ఘ కామెడీ డైలాగ్ నేపథ్యంలో వస్తుండగా ఇంటి పనులు చకచకా పూర్తి చేసి రియల్ మెన్ అనిపించుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన గత చిత్రాల హీరోలైన మాస్ మహారాజ్ రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ధరమ్ తేజ్ లను ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేశారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వెంకటేష్, వరుణ్ హీరోలుగా 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కించనున్నారు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలోనే అనిల్ రావిపూడి ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు