‘శివం భజే’ చిత్ర దర్శకుడు అప్సర్‌కి గామా అవార్డ్స్‌లో ప్రత్యేక గౌరవం

‘శివం భజే’ చిత్ర దర్శకుడు అప్సర్‌కి గామా అవార్డ్స్‌లో ప్రత్యేక గౌరవం

Published on Sep 3, 2025 8:00 PM IST

Shivam-Bhaje

ప్రతిష్టాత్మక GAMA (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) వేడుక యూఏఈలోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల రాత్రి తెలుగు సినిమా తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘శివం భజే’ దర్శకుడు అప్సర్. తన చిత్రానికి గాను ఆయనకు మోస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ అవార్డు లభించింది.

అప్సర్‌కి ఇది కొత్త విషయం కాదు. ఆయన రూపొందించిన తొలి చిత్రం ‘గంధర్వ’ వినూత్న కాన్సెప్ట్‌తో సినీప్రేమికులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ ద్వారా వేరే రకమైన స్టైల్, టేకింగ్, మేకింగ్ చూపించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సక్సెస్‌తో ఉత్సాహం పొందిన దర్శకుడు ప్రస్తుతం కొన్ని విభిన్నమైన కథలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు