ఆ దర్శకుడిపై మండిపడుతున్న మహిళా సంఘాలు

Published on Nov 27, 2019 11:00 pm IST

తమిళ సీనియర్ నటుడు దర్శకుడు భాగ్యరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మహిళలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఫెమినిస్టుల కోపానికి కారణమయ్యాయి. ‘ సెల్‌ఫోన్ అతిగా వాడటంతో మహిళలు చేయిదాటిపోయారని భాగ్యరాజ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అత్యాచార ఘటనల్లో పురుషులదే తప్పు అనడం సబబు కాదు.. మహిళలకు బలహీనత ఉండటంవల్లే పురుషులు దానిని అవకాశంగా తీసుకుని అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనితో ఆయనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

భాగ్యరాజ్ వ్యాఖ్యలపై ఫెమినిస్ట్ గాయని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానభంగాలు జరగడానికి మహిళలను బాద్యులను చేస్తూ ఆయన మాట్లాడిన తీరును ఆమె తప్పుబట్టారు. ఆంద్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఐతే భాగ్యరాజుకి కొంచెం ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :