మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా158’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ బాబీ సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చాడు.
‘ఎలాంటి శబ్దాలు లేవు.. ఎలాంటి డిస్ట్రాక్షన్ లేదు.. కేవలం మెగాస్టార్‌తో కలిసి ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌ను బిల్డ్ చేయడంపైనే పూర్తి ఫోకస్ పెట్టాను’ అంటూ బాబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇటీవల ఈ సినిమా పొల్లాచ్చి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడంతో తర్వత షెడ్యూల్‌పై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో మెగాస్టార్‌ను మళ్లీ వెండితెరపై వింటేజ్ లుక్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పుడే లూప్‌లో గెట్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


