“వన్ నాట్ ఫైవ్” చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్న డైరెక్టర్ బాబీ!

Published on Aug 8, 2021 10:00 pm IST

హన్సిక మొత్వాని ప్రధాన పాత్రల్లో ఇన్నోవేటివ్ మరియు ఎక్స్ పర్మెంటల్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం వన్ నాట్ ఫైవ్ మినిట్స్. ఈ చిత్రం ను బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజు దుస్సా వహిస్తున్నారు. చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి ఆసక్తి నెలకొనడం తో ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ప్రముఖ దర్శకుడు బాబీ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 9 వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. చిత్ర యూనిట్ చేసిన ఈ ప్రకటన తో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :