కావాల్సినంత టాలెంట్ ఉంది.. కానీ ఛాన్సే లేదు !

Published on Apr 28, 2019 6:29 pm IST

సినీ పరిశ్రమలో విజయానికే అవార్డులు, రివార్డులు. పరాజయంలో ఉన్న వాడికి ఎంత గొప్ప ప్రతిభ ఉన్నా.. అవకాశాలు మాత్రం అంత త్వరగా రావు. బాణం లాంటి వినూత్నమైన చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు చెైతన్య దంతులూరి. దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు.

దాంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి అవకాశాలు కరువయ్యాయి. కావాల్సినంత టాలెంట్ ఉన్న.. ఛాన్సే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన మొదటి హీరో ‘నారా రోహిత్’తో ఓ సినిమా అనుకున్నాడు చెైతన్య. 1971 కాలంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఎప్పుడో మొదలవ్వాలి. అందుకు తగ్గట్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేశాడు. అయినా ఈ సినిమా ఇంకా మొదలవ్వలేదు. అయితే స్క్రిప్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందని, ఈ సారి చైతన్య హిట్ కొట్టడం గ్యారింటీ అని తెలుస్తోంది. మరి ఈ సారీ అన్న చెైతన్య దంతులూరికి హిట్ వస్తోందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :