‘పెద్ది’ కొత్త సీన్స్ ఎప్పటి నుంచి? క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!

‘పెద్ది’ కొత్త సీన్స్ ఎప్పటి నుంచి? క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!

Published on Jun 14, 2026 6:00 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ తన సరసన నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే ఇది. భారీ వసూళ్లు అందుకొని ఇప్పుడు సాలిడ్ వీకెండ్ లో మళ్లీ కొత్త ఊపు తెచ్చుకున్న ఈ సినిమాలో కొత్త సీన్స్ యాడ్ చేస్తారని మళ్లీ కొంచెం ఎడిట్ చేసిన సీన్స్ తో సినిమా రాబోతుంది అని ఆల్రెడీ టాక్ ఉంది.

అయితే చాలా మంది నిన్న శనివారం నుంచి ఈ అప్డేట్ చేసిన ప్రింట్ ఉంటుంది అని భావించారు కానీ రాలేదు. అయితే ఫైనల్ గా దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేసాడు. పెద్ది థియేటర్స్ లో కొత్త సీన్స్ ఈ బుధవారం నుంచి జత చేస్తున్నట్టు తెలిపాడు. మరోసారి చూడాలి అనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక అది వచ్చాక వసూళ్లు మళ్లీ పెరుగుతాయ లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు