ఈ మాస్ డైరెక్టర్ మళ్లీ పొలీస్ కథతోనే వస్తున్నాడా..?

Published on Oct 17, 2018 9:08 am IST


తమిళ దర్శకుడు హరి మాస్ డైరెక్టర్ గా.. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలను సృష్టించడంలో.. ఆ పాత్రలను అంతే వీరోచితంగా తెర పై చూపించడంలో తిరుగు లేని ఇమేజ్ ని సంపాదించుకున్న డైరెక్టర్. పైగా హరి, సూర్య కాంబినేషన్ అంటే… అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ చిత్రాలే ఇందుకు నిదర్శనం, దానికి తోడు సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని పోలీసు పాత్రలో చూపిస్తాడు హరి. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.

కాగా దర్శకుడు హరి ఈ చిత్రాన్ని కూడా పోలీస్ నేపధ్యంలోనే రూపొందించనున్నా డట. అయితే హరి ఇటీవలే చియాన్ విక్రమ్ తో సామి చిత్రానికి సీక్వెల్ గా సామి స్క్వేర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినప్పటికీ.. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా హరి మళ్ళీ పోలీస్ కథతోనే హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడని కోలీవుడ్ వర్గాల టాక్. మరి తనకు అచ్చు వచ్చిన పోలీస్ స్టోరీతోనే హరి హిట్ కొడతాడేమో చూడాలి. పైగా హరి, సూర్య కాంబినేషన్ అంటే ఎలాగూ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :