​నేటి హిట్ సినిమాల్లో దర్శకుడు జయశంకర్ చిత్రాల ఛాయలు

​నేటి హిట్ సినిమాల్లో దర్శకుడు జయశంకర్ చిత్రాల ఛాయలు

Published on Apr 7, 2026 6:00 AM IST

Jayashankarr

టాలీవుడ్ దర్శకుడు జయశంకర్ గతంలో తెరకెక్కించిన ప్రాజెక్టుల కాన్సెప్ట్‌లు.. ప్రస్తుత సూపర్ హిట్ సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన హిట్ చిత్రం ‘క’ (KA) కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే.. 2015లో జయశంకర్ రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy) షార్ట్ ఫిల్మ్‌ను గట్టిగా గుర్తుచేస్తాయి. దేవుడికి, మనిషికి మధ్య జరిగే సంభాషణల నేపథ్యాన్ని ఆయన అప్పట్లోనే అద్భుతంగా ఆవిష్కరించారు.

​అలాగే, కోలీవుడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రం ‘LIK’ ట్రైలర్ కూడా జయశంకర్ 2020 నాటి ‘విటమిన్ షీ’ (Vitamin She) కథను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. మొబైల్ ఫోన్‌కు బానిసైన (నోమోఫోబియా) ఓ యువకుడి జీవితాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా నియంత్రించిందనే పాయింట్‌ను ‘విటమిన్ షీ’లో ఎంతో ముందుచూపుతో చూపించారు.

​ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ‘అరి’ (Ari: My Name is Nobody). భారతీయ వెండితెరపై మునుపెన్నడూ స్పృశించని సరికొత్త, లోతైన పాయింట్‌తో దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

 అయితే, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ వివాదం కారణంగా ఈ సినిమాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఏదేమైనా జయశంకర్ ఆలోచనలు, ఆయన ఎంచుకున్న కథలు నేటి తరం సినిమాలకు స్ఫూర్తిదాయకంగా మారుతున్నాయని చెప్పవచ్చు.

తాజా వార్తలు