నిర్మాతగా దిల్ రాజుతో జాయిన్ అవుతున్న క్రిష్

నిర్మాతగా దిల్ రాజుతో జాయిన్ అవుతున్న క్రిష్

Published on Oct 19, 2019 1:13 PM IST

టాలీవుడ్ ఏస్ నిర్మాతగా దిల్ రాజు వరుస చిత్రాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా ఆయన బడా చిత్రాలతో పాటు, చిన్న చిత్రాలను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కాగా ఈయనతో టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ నిర్మాతగా జాయిన్ అవుతున్నారట. ఓ మూవీని వీరిద్దరూ కలిసి నిర్మిస్తుండగా, నేడు అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం.

సాగర్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, డైరెక్టర్ మరియు నటుడు అయిన శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు రూపొందిస్తారని తెలుస్తుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం దిల్ రాజు వివి వినాయక్ హీరోగా వస్తున్న సీనయ్య, రాజ్ తరుణ్ నటిస్తున్న ఇద్దరి లోకం ఒకటే,నాని ఇంద్రగంటి మోహన కృష్ణ తో చేస్తున్న ‘వి’ చిత్రాల నిర్మాతగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు