సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా… మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా… గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమా కథ గురించి తాజాగా మారుతి మాట్లాడుతూ.. “ఈ సినిమా చివరి షెడ్యూల్ లో ఉందని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ సినిమా ఇద్దరినీ కలిపే కథ అనీ, ఫ్యామిలీని కలిపే కథ అని అనుకుంటున్నారు. ఇక సత్య రాజ్ గారు చేసిన యాక్టింగ్ కి మాకే కళ్లలో నీళ్లొచ్చాయి అంటూ మారుతి తెలిపారు.
కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.


