చిన్న సినిమాలను నిర్మించడం ఆపేశానంటున్న ప్రముఖ డైరెక్టర్ !

Published on Sep 9, 2018 10:04 am IST

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నిర్మించే చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే మారుతి మాట్లాడుతూ.. ‘‘నేను ఒక స్క్రిప్ట్ బాగా రాసుకొని ఓ డైరెక్టర్ కి ఇస్తే.. అతను ఆ స్క్రిప్ట్ ని బాగా తెరకెక్కించడం ఒక రకం, అలా కాకుండా అతను అతని శైలిలో తియ్యడం ఒక రకం. ఈ క్రమంలో వాళ్లు బాగా తీయవచ్చు, తీయలేకపోవచ్చు. ఎందుకంటే ఓ సినిమాని ఓ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తునప్పుడు మనం కొంత వరకు మాత్రమే ఇన్ వాల్వ్ అవ్వగలం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక చిన్న సినిమాలను నిర్మించడం ఆపేశాను. ఒకవేళ సినిమా చెయ్యాల్సి వస్తే నాకు నా టీమ్‌ కు పూర్తి నమ్మకం కుదిరాకే చేస్తాను అని మారుతి తెలిపారు.

సంబంధిత సమాచారం :