తీస్తే నెక్స్ట్ లెవెల్ విజువల్ సినిమానే తీస్తా – మారుతి

Published on Aug 1, 2021 1:02 pm IST


మన టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో మారుతి కూడా ఒకరు. వరుస హిట్స్ తో అలాగే వరుస ప్రాజెక్టు లతో దూసుకెళ్తున్న మారుతి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ‘ఈటీవీ ప్లస్ చెప్తా’ కార్యక్రమంలో పలు ఆసక్తికర అంశాలు తన సినిమా జీవితం కోసం లైఫ్ స్టైల్ కోసం చెప్పారు. అయితే తాను అందరి లానే దిగువ మధ్య తరగతి స్థాయి నుంచి వచ్చినవాడినే అని అయితే తన చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి వచ్చే వరకు కూడా తాను స్టిక్కరింగ్ నుంచి ఆర్టిస్ట్ గా చాలా వర్క్స్ చేసానని కానీ హైదరాబాద్ వచ్చాక ఆర్ట్ అంటే ఏమిటో అందులో ఎంత లోతు ఉందో తెలుసుకున్నని చెప్పారు.

అలాగే తాను చాలా సినిమాలకు డైరెక్టర్ కాక ముందు స్కెచింగ్ నుంచి స్టోరీ బోర్డింగ్ చేసేవాడనని తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి “అంజి” సినిమాకి అయితే క్లైమాక్స్ పార్ట్ కోసం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పిలిచి అవకాశం ఇచ్చారని మారుతి తెలిపారు. అలాగే తన నుంచి ఇంకా గ్రాఫికల్ సినిమా ఏదీ రాలేదు.. కానీ నా నుంచి వస్తే నెక్స్ట్ లెవెల్ విజువల్ సినిమా వస్తుంది అని మారుతి హింట్ ఇచ్చారు. తనలో ఈ టాలెంట్ కూడా ఉందని ఈ షో ద్వారానే తెలిసింది. మరి తన నుంచి ఆ గ్రాండ్ విజువల్ చిత్రం ఎపుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :