రజని “దర్బార్” మూవీ పై హాట్ అప్డేట్…!

Published on Jul 25, 2019 11:24 am IST

క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తలైవా రజని మొదటిసారి నటిస్తున్న చిత్రం “దర్బార్”. చాలా కాలం తరువాత రజని పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల షూటింగ్ సెట్స్ లో లీకైన రజని లుక్ అదిరేలా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ కథ డిమాండ్ మేరకు ఈ మూవీ మేజర్ పార్ట్ మొత్తం ముంబై లోనే చిత్రీకరణ జరగనుందని సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సోషల్ మెస్సేజ్ ఉన్న కథగా “దర్బార్” మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

కాగా ఈ మూవీపై ఓ అప్డేట్ నేడు సాయంత్రం ఇవ్వనున్నట్లు దర్శకుడు మురుగదాస్ తెలియజేశాడు. ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ మినహా ఎటువంటి అప్డేట్స్ అనేవి రాలేదు. మరి నేటి సాయంత్రం దర్బార్ టీజర్ కి సంబందించిన ఏమైనా సమాచారం ఇస్తారేమో చూడాలి.

నయనతార,నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా,అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :