అంగరంగ వైభవం గా ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు పుట్టిన రోజు వేడుకలు..!!

Published on Aug 23, 2019 10:00 am IST

ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) పుట్టినరోజు సందర్భంగా అయన ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖులైన శ్రీ అన్నపూర్ణమ్మ , జమున, సురేష్ కొండేటి , వినాయక రావు గారు ల సమక్షంలో తన భర్త డే కేక్ కట్ చేశారు..ఈ సందర్భంగా విచ్చేసిన సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది..

ఈ సందర్భంగా జమున గారు మాట్లాడుతూ “దర్శకుడు నర్రా శివనాగేశ్వరావు, నా దత్త పుత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు శివనాగేశ్వరావు పుట్టినరోజు ఒకే రోజు కావడం, ఇద్దరి పుట్టిన రోజు ఆగష్టు 22 వతేదీ కావడం గొప్ప విశేషం.. ఈ పుట్టిన రోజు సందర్భంగా మా శివనాగు కూడా ఇంకా మరిన్ని మంచి చిత్రాలు తీసి మెగా డైరెక్టర్ కావాలని అమ్మగా దీవిస్తూ మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు శివనాగుని ఇద్దరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నాను అన్నారు.. వచ్చిన అతిధులకు శివనాగు కృతజ్ఞతలు చెప్పారు.. ప్రస్తుతం ఆయన అన్నపూర్ణమ్మ గారి మనవడు దేవినేని చిత్రాలతో బిజీగా ఉన్నానని తనకు మంచి అవకాశాలు ఇచ్చిన తన నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను అన్నారు..

సంబంధిత సమాచారం :