మహేష్ కి కథ చెప్పనున్న డాషింగ్ డైరెక్టర్ !

మహేష్ కి కథ చెప్పనున్న డాషింగ్ డైరెక్టర్ !

Published on May 2, 2021 3:00 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట.ఇదిలా వుంటే ఎప్పటి నుంచో పూరి మదిలో వున్న జనగనమణ సినిమా స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి మహేష్ కి వినిపించాలనుకుంటున్నాడట పూరి. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ ఆ కథ మీద కూర్చోలేదు. మధ్యలో ఆ సినిమాని రానాతో చేయలన్నా కుదరలేదు.

ఇక ఇటివలే మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పూరి కథ చెబితే వింటానని చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లుగానే పూరి కూడా రెడీ అవుతున్నాడు. త్వరలోనే మహేష్ కి కథ చెప్పనున్నాడు. అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట. మరి ఈ కథ పై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు