“ఇస్మార్ శంకర్” స్ఫూర్తి మాత్రమే.. కాపీ కాదు !

Published on Jul 17, 2019 1:49 am IST

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన పూరి జగన్నాధ్, ఆ తరువాత వరుస పరాజయాలతో హిట్ రేస్ లో వెనుకబడిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా “ఇస్మార్ట్ శంకర్” మూవీ వేదిక పై ఒప్పుకున్నాడు. ఈసారి ఇస్మార్ట్ శంకర్ తో ఖచ్చితంగా హిట్ కొడతాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారాయన. ట్రైలర్స్ లో హీరో రామ్ ఉర మాస్ తెలంగాణా కుర్రాడిగా ఇరగదీశాడు. పూరి మార్క్ హీరో మేనరిజంకి, రామ్ ఎనెర్జీ తోడైతే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడవచ్చు.

ఐతే ట్రైలర్ విడుదలనప్పటినుండి ఈ చిత్రం పై విమర్శలు మొదలు పెట్టారు. ఇది హాలీవుడ్ మూవీకి కాపీ అని కొన్ని మీడియా చానెల్స్ లో ప్రచురించడం జరిగింది. ఇంకా రెండు రోజులలో మూవీ విడుదల నేపథ్యంలో పూరి ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి ఆయనను ఈ విషయంపై విచారించగా, ఈ కథ హాలీవుడ్ సినిమా స్పూర్తితో రాసుకున్నదే, కానీ కాపీ కాదు. ఇస్మార్ట్ శంకర్ విడుదల తరువాత మీరు ఈ రెండు చిత్రాలను పోల్చి చూసుకోండి, వ్యత్యాసం మీకే తెలుస్తుందన్నారు.

పూరి కనెక్టస్ బ్యానర్ పై ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్,నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :