డాషింగ్ డైరెక్టర్ తో క్రేజీ హీరో ఫిక్స్ అయినట్లే !

Published on Dec 15, 2018 5:36 pm IST

గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు పూరి జగన్నాథ్ నుండి నిరాశపరిచే సినిమాలే ఎక్కువుగా వస్తున్నాయి. ప్రస్తుతం పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత చిత్రాన్ని కూడా పూరి లైన్లో పెట్టారు.

తాజా నివేదికల ప్రకారం, పూరి జగన్నాథ్ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. కాకినాడలో డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్న విజయ్ దగ్గర వచ్చి మరి, పూరి తన స్టోరీని విజయ్ చెప్పాడు.

కాగా పూరి స్టోరీకి ప్లాట్ అయినా విజయ్, వెంటనే పూరికి యస్ చెప్పాడట. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావల్సి ఉంది. అయితే పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోని విలక్షణమైన వ్యక్తిగా వైవిధ్యంగా చూపించడంలో దిట్ట. మరీ విజయ్ ని ఎలా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :