స్టార్ హీరో సినిమా నుండి తప్పుకున్న ‘టాలెంటెడ్ డైరెక్టర్’ !

Published on May 19, 2019 1:02 pm IST

రాఘవ లారెన్స్ హీరోగా మరియు దర్శకుడిగా వచ్చిన ‘కాంచన’ హిందీలో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను కూడా చిత్రీకరించింది చిత్రబృందం.

కాగా తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు లారెన్స్ తప్పుకున్నట్లు ప్రకటించారు. తనకు సరైన గౌరవం ఇవ్వలేదు అని, గౌరవం లేని చోట ఉండకూడదని తానూ నిర్ణయించుకున్నట్లు లారెన్స్ తెలిపారు. సినిమాకి సంబంధించి నిర్మాతలు లారెన్స్ కు చెప్పకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట. అందుకే లారెన్స్ ఫీల్ అయ్యారట. ఇటీవలే వచ్చిన సినిమా ఫస్ట్ లుక్ కూడా లారెన్స్ కి తెలియకుండానే రిలీజ్ చేశారు.

అయితే లారెన్స్ మాత్రం తన స్క్రిప్టును అక్షయ్ కుమార్ మీద గౌరవంతో వారికే ఇచ్చేస్తానని, దర్శకుడిగానే తాను ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పారు.

సంబంధిత సమాచారం :

More