దిగ్గజ నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్ర రావు నటుడిగా పెళ్లి సందడి లో!

Published on Jul 30, 2021 6:59 pm IST

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎన్నో బ్లాక్ బస్టర్, క్లాసిక్ చిత్రాలను అందించారు దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, తాప్సీ, ఖుష్బూ లతో పాటుగా ఎంతో మందిని సినీ పరిశ్రమ కి పరిచయం చేశారు. అయితే వంద కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు గారు తొలి సారి ఒక చిత్రం లో నటిస్తున్నారు.

పెళ్లి సందD చిత్రం లో రాఘవేంద్ర రావు గారు వశిష్ట పాత్రలో నటిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారుతోంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత సమాచారం :