“ఆర్ఆర్ఆర్” మూవీ మొదలైంది అప్పుడే…వైరల్ అవుతోన్న అప్పటి ఫోటో!

“ఆర్ఆర్ఆర్” మూవీ మొదలైంది అప్పుడే…వైరల్ అవుతోన్న అప్పటి ఫోటో!

Published on Mar 25, 2022 2:00 PM IST


బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత జక్కన్న రాజమౌళి రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో రౌద్రం రణం రుధిరం చిత్రం ను అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ ఇద్దరి హీరోలతో రాజమౌళి దిగిన ఒకప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వీరి కాంబో కన్ఫర్మ్ చేసిన ఫోటో అది. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కావడం తో, అభిమానులు ఈ ఫోటో ను గుర్తు చేసుకుంటున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటించగా, డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం సర్వత్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు