మహేశ్‌తో తప్పకుండా నా సినిమా ఉంటుంది – ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్

Published on Aug 10, 2021 11:00 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటాడు. అయితే కొద్ది రోజుల క్రితం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా కూడా మహేశ్ బాబుకు ఓ కథ వినిపించినట్టు చెప్పుకొచ్చాడు. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి చిన్నపాటి అప్డేట్ కూడా లేకపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టేనని అందరూ అనుకున్నారు.

ఈ నేపధ్యంలో మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి ఈ ప్రాజెక్టు గురుంచి మరోసారి ప్రస్తావించారు. తాను చెప్పిన కథ లైన్ మహేశ్ బాబుకి నచ్చిందని, ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, మా ఇద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్ లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, తప్పకుండా మా ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :