సౌత్ స్టార్ డైరెక్టర్ తో బాలీవుడ్ సూపర్ స్టార్ !

Published on Aug 7, 2019 3:00 am IST

టెక్ మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ శంకర్‌ సినిమా పై ఇప్పటికే చాల ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం శంకర్, కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు సీక్వెల్‌ షూటింగ్ ను మళ్లీ ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత శంకర్‌ సముద్రం నేపథ్యంలో సాగే ఓ ‌3డి సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సమందించిన స్క్రిప్టు కూడా పూర్తయిందట.

కాగా ఫుల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ గా రానున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ నటిస్తున్నారట. విజువల్‌ ఎఫెక్ట్స్కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. గత సినిమా రోబో 2.0లో అక్షయ్‌ కుమార్‌ తో కలిసి పని చేసిన శంకర్.. ఈ సారి షారుఖ్ తో కలిసి పనిచేయబోతున్నాడు అన్నమాట.

ఇక ఈ సినిమాలో మరికొన్ని పాత్రల్లో తెలుగు తమిళ నటీనటులు కూడా నటిస్తారట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో గాని.. శంకర్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More