ఇండియన్ 2 సెట్లో తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన !

Published on Feb 20, 2020 12:06 am IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వస్తోన్న ‘భారతీయుడు 2’ సెట్లో తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ప్రదేశంలో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం జరిగింది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశంలో ఒక పెద్ద క్రేన్ ఒక్కసారిగా కిందపడటంతో ముగ్గురు వ్యక్తుల అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో మధు(29), చంద్రన్ (60) ఇద్దరు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ మరియు
సహాయ దర్శకుడు కృష్ణ (34) ఉన్నారు. మృతదేహాలను రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇక గాయపడిన క్షతగాత్రులకు సవిత మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే దర్శకుడు శంకర్ కూడా గాయపడ్డారని తెలుస్తోంది. కాగా ఈ దురదృష్ట ఘటన గురించి తెలుసుకొని అందరూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్న క్రమంలో ఇలా జరగడం బాధాకరమైన విషయం.

సంబంధిత సమాచారం :

X
More