‘రోబో 2.0’ పై డైరెక్టర్ శంకర్ కొత్త అప్డేట్
Published on Oct 5, 2016 12:53 pm IST

robo2
దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీల కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సెన్సేషన్ ను రిపీట్ చేయడానికి శంకర్, రజనీలు ‘రోబో 2.0’ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. ‘కబాలి’ తరువాత కొన్నాళ్ళు ఆరోగ్యం బాగోలేకపోవడంతో రెస్ట్ తీసుకున్న రజనీ ఈ మధ్యే రోబో షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మీదే నడిచే కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది.

ఇదే విషయాన్నీ దర్శకుడు శంకర్ తెలుపుతూ ఇప్పటికే 66 శాతం షూటింగ్ పూర్తయింది. ఈరోజుతో 150వ రోజు షూటింగ్ ముగుస్తుంది అన్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తుండగా యామీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఈ సంవత్సరం నవంబర్ లో విడుదల చేసి సినిమాను వచ్చే సంవత్సరం దీపావళి కానుకగా ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

 
Like us on Facebook