స్టార్ హీరోతో హిట్ డైరెక్టర్ !

స్టార్ హీరోతో హిట్ డైరెక్టర్ !

Published on Mar 7, 2019 1:00 AM IST

గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు శివ. తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది.

కాగా తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యతో తన తరువాత సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట శివ. తమిళంలో విశ్వాసం భారీ విజయం సాధించడంతో శివకు తమిళంలో బాగా డిమాండ్ పెరిగింది. కానీ శివ మాత్రం హీరో సూర్యకు ఓ కథ చెప్పాడట. కథ బాగా నచ్చిన సూర్య, సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు