డైరెక్టర్ సుకుమార్ అంతకు మించిన సాయం.!

Published on May 23, 2021 9:29 am IST

మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కరోనా ప్యాండమిక్ మూలాన మరియు బన్నీకి కోవిడ్ పాజిటివ్ రావడంతో షూట్ ని కొన్ని రోజులు పాటు నిలిపివేశారు. అయితే ఈ విరామంలో సుకుమార్ తాను జన్మించిన స్వస్థలానికి ఏదైనా చెయ్యాలని పూనుకున్నారు.

అందుకు రాజోలు సహా కోస్తా ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లు సహా కాన్సన్ట్రేషన్స్ వితరణ నిమిత్తం తన స్నేహితులతో మాట్లాడి మొదట 25 లక్షలు సాయం అందించారు. కానీ ఇపుడు సుకుమార్ 15 లక్షలు జత చేసి మొత్తం 40 లక్షలతో అంతకు మించిన సాయం అందిస్తున్నట్టుగా తెలిసింది. దీనితో ఆ మొత్తనితో ఒక ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించడానికి పూనుకుని ఒక గ్రేట్ మూవ్ తీసుకున్నారు. ఇలాంటి సమయంలో తాను ఇలా నిలబడడం నిజంగా హర్షణీయం.

సంబంధిత సమాచారం :