ఇద్దరు క్రేజీ హీరోలతో తేజా సినిమాలు.

Published on Feb 22, 2020 3:23 pm IST

ఒకప్పుడు యూత్ ఫుల్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న తేజ ఈ మధ్య రానా హీరోగా వచ్చిన నేనేరాజు నేనే మంత్రి సినిమాతో చాలా కాలం తరువాత హిట్ అందుకున్నారు. ఐతే గత ఏడాది కాజల్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా ఆయన తీసిన సీత పరాజయం పాలైంది. ఈ మూవీ తరువాత మళ్ళీ కాజల్ తో మరో చిత్రం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఆయన ఇంత వరకు ఎటువంటి చిత్రం ప్రకటించలేదు. కాగా నేడు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించారట.

అందులో ఒక టైటిల్ ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నారని సమాచారం. రెండు విభిన్నమైన టైటిల్స్ మరియు క్యాస్టింగ్ తో తేజ చిత్రాలపై ఆసక్తిపెంచేశారు. మరి ఈ రెండు చిత్రాలకు సంబంధించిన మరి డీటెయిల్స్ త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More