‘స్టార్ కమెడియన్’ కోసం ఫుల్ కామిక్ రోల్ రాసిన ‘త్రివిక్రమ్’ !

Published on Aug 6, 2019 4:04 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల్లు అర్జున్’ 19వ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లో అద్భుతమైన కామెడీ ఉండేలా చూసుకుంటాడు. కాగా ఇప్పడు బన్నీతో చేస్తోన్న సినిమాలో కూడా కామెడీ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట. ముఖ్యంగా వెన్నల కిషోర్ కోసం అద్భుతమైన పాత్రను రాశాడట. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి – కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని.. అలాగే సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ లో కూడా కిషోర్ పగలబడి నవ్వేలా కామెడీ చేస్తాడట.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో టబు, పూజా హెగ్డే, నవదీప్, మరియు సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2020 లో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :