హీరోగా మారబోతున్న వి.వి.వినాయక్.. ?

Published on May 14, 2019 11:56 am IST

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గురించి ఓ నమ్మలేని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే వి.వి.వినాయక్ హీరోగా అవతారమెత్తబోతున్నాడనే వార్త. వినాయక్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం రాబోతుందనే న్యూస్, ప్రస్తుతం షోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది.

పైగా వి.వి.వినాయక్ వయసు, ఫిజిక్ కి తగ్గట్లు.. స్క్రిప్ట్ ఉంటుందని.. అందుకే హీరోగా నటించడానికి వినాయక్ కూడా అంగీకరించాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా నరసింహారావు వ్యవహరించనున్నారట. ఈయన గతంలో శరభ అనే సినిమాని తీశారు. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అసలు అధికారిక ప్రకటన వస్తే గాని ఈ వార్తను పూర్తిగా నమ్మలేం.

సంబంధిత సమాచారం :

More