‘మహర్షి’ విజయానికి ముఖ్య కారణం మహేష్ గారే – వంశీ పైడిపల్లి

Published on May 12, 2019 4:36 pm IST

బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్యన వచ్చిన ‘మహర్షి’కి ఇంకా రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. మహేశ్ బాబు స్టార్ డమ్ కి తగ్గట్లు, వంశీ పైడిపల్లి అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎంచుకున్న సబ్జెక్ట్ ‘మహర్షి’ని భారీ హిట్ స్థాయిలో నిలబెట్టింది.

కాగా చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే మా అమ్మానాన్నల వల్లే. ఇక ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అశ్వినీదత్ గారు పివిపి గారు, దిల్ రాజు గారు, శిరీష్, లక్ష్మణ్ గార్లు ఇచ్చిన ధైర్యం, సపోర్ట్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. చివరిగా ‘మహర్షి’ విజయానికి ముఖ్య కారణం మహేష్ గారే అని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More