“ఐకాన్” విషయంలో వేణు శ్రీరామ్ కి లైన్ క్లియర్..!?

Published on Jul 8, 2021 8:43 pm IST


నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మొట్ట మొదటగా అనుకున్న పాన్ ఇండియన్ సినిమా “ఐకాన్” అని తెలిసిందే. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు రీత్యా ఈ చిత్రం కాస్త వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో వేణు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “వకీల్ సాబ్” అనే చిత్రం తీసి సాలిడ్ హిట్ కొట్టాడు.

అలాగే బన్నీ సుకుమార్ తో “పుష్ప” చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో అనౌన్స్ చేశారు. అయితే మళ్లీ కొన్ని పరిణామాల రీత్యా వేణు శ్రీరామ్ ఐకాన్ రేస్ లోకి రావడంతో బన్నీ లైనప్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజుకి మరియు వేణుకి చిన్న స్పర్థలు వచ్చాయని టాక్ ఉంది.

అయితే ఇప్పుడు అవన్నీ సెట్ అయ్యిపోయాయట. దిల్ రాజు వేణు శ్రీరామ్ కి పూర్తి స్వేచ్చని ఇచ్చేశారట. ప్రస్తుతం అయితే వేణు శ్రీరామ్ క్యాస్టింగ్ సహా టెక్నీకల్ టీం ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం పుష్ప పార్ట్ 1 కంప్లీట్ అయ్యాక వెంటనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :