విక్రమ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో ?
Published on Mar 13, 2018 6:49 pm IST

‘హలో’ సినిమా తరువాత డైరెక్టర్ విక్రమ్ కుమార్ నానితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం మేరకు శర్వానంద్ విక్రమ్ కుమార్ మూవీ ఉండొచ్చని సమాచారం . వైజయంతి మూవీస్ సంస్థలో విక్రమ్ కుమార్ ఈ సినిమా చెయ్యబోతున్నాడు. అయితే నాని, శర్వానంద్ లలో హీరో ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు.

నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్ 12 న విడుదల కాబోతోంది. ఈ సినిమా తరువాత నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తాడు నాని. శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుధీర్ వర్మతో ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక విక్రమ్ కుమార్ సినిమా ఉండే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook