ముదురుతున్న సినీ ప్రముఖుల విగ్రహాల వివాదం !

Published on May 15, 2019 11:59 am IST

కొంతకాలం క్రితం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ విశాఖ నగరానికి ఎలాంటి సంబంధంలేని వ్యక్తుల విగ్రహాలను సరైన అనుమతులు లేకుండా ఆర్కే బీచ్ రోడ్లో ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చింది. దీంతో 13వ తేదీ రాత్రి పోలీసులు, విశాఖ నగరపాలక సంస్థ అధికారులు కలిసి హడావుడిగా మూడు విగ్రహాలను తొలగించేశారు.

ఈ చర్య పట్ల పలువురు అభిమానులు ఆరోజే ఆందోళన చేయగా ఇప్పుడు వివాదం మరింత ముదిరింది. సినీ ప్రముఖుల విగ్రహాల్ని ఎలా తొలగిస్తారంటూ ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం పోరాటానికి దిగింది. మూడు విగ్రహాల్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేస్తోంది. అలా చేయని పక్షంలో తమ పోరాటాన్ని దశలవారీగా తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు కూడా చేసింది. మరి ఈ వివాదంపై విశాఖ నగరపాలక సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More