నిరాశపరిచిన ‘తేజ్ ఐ లవ్ యు’ కలక్షన్స్ !

నిరాశపరిచిన ‘తేజ్ ఐ లవ్ యు’ కలక్షన్స్ !

Published on Jul 7, 2018 9:08 PM IST

tej i love u

కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. ఇక నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కరుణాకరన్ మ్యాజిక్ వర్క్ అవుట్ కాకపోవడంతో పాటు ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది .

ఇక మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1.91 కోట్ల షేరును మాత్రమే రాబట్టుకోగలిగింది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక వరుస పరాజయాలతో కొనసాగుతున్న తేజు కు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చేలా ఉంది.

తాజా వార్తలు