ఈ మధ్య కాలంలో మన దేశంలో డిజిటల్ వరల్డ్ ఏ రేంజ్ లో ఊపందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ వెబ్ ప్రపంచంలో ఎన్నో సినిమాలు సిరీస్ లు ఇప్పుడు వస్తున్నాయి. అయితే మన దేశపు వెబ్ సిరీస్ లలో అయితే మాస్ మరియు యూత్ లో ఒక సెన్సేషన్ ను రేపిన వెబ్ సిరీస్ “మీర్జాపూర్”.
మొదటి సీజన్ ఓ రేంజ్ లో అన్ని భాషల్లో కూడా సంచలనం రేపింది. దీనితో రెండో సీజన్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూడగా అది కూడా వచ్చి దాన్ని మించిన హిట్టయ్యింది. కానీ ఇప్పుడు సీజన్ 3 కు మాత్రం గట్టి దెబ్బ తప్పేలా లేదని తెలుస్తుంది.
ఎందుకంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్ ప్రకారం ఓటిటి కి సెన్సార్ తప్పనిసరి అనేది కావడంతో ఇపుడు “మీర్జాపూర్ 3” మేకర్స్ ఆలోచనలో పడ్డారట. ఈ ఐ అండ్ బి సెన్సార్ మూలాన సీజన్ 3 లో చాలానే మార్పులు ఉండనున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు అడల్ట్ కంటెంట్ ను ఈ సీజన్లో తొలగించాలని చూస్తున్నారట.
ఇది మాత్రం మీర్జాపూర్ ఫ్యాన్స్ కు గట్టి షాకే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ లలో కంటెంట్ ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అంతే మోతాదులో అన్నీ కూడా ఉంటాయి. అలా మన వాళ్ళకి ఈ సిరీస్ బిగ్గెస్ట్ కల్ట్ ఫాలోయింగ్ కలిగిన సిరీస్ గా నిలిచింది. ఇప్పుడు వాటిలో కొన్ని మిస్సవుతున్నాయి అంటే వారికిది నిరుత్సాహ పరిచే అంశమే అని చెప్పాలి.


