ప్రపంచ వ్యాప్త పాపులర్ సూపర్ హీరోస్ లో ఒకరైన స్పైడర్ మ్యాన్ పై వస్తున్న అవైటెడ్ తాజా చిత్రమే ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’. చాలా కాలం తర్వాత మార్వెల్ సంస్థ నుంచి అభిమానులు ఇతర ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఇండియాలో కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
అందుకే ప్రపంచ వ్యాప్తంగా సినిమా జూలై 31 న విడుదల అవుతుంటే మన దగ్గర మాత్రం ఓ రోజు ముందే వచ్చేస్తుంది. అయితే ఇండియాలో స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్ ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. ఇండియాలో ఈ సినిమా ఐమాక్స్ వెర్షన్ రిలీజ్ లేదని సోనీ పిక్చర్స్ వారు కన్ఫర్మ్ చేశారు.
కానీ ఇతర లార్జ్ ఫార్మాట్ లలో సినిమా విడుదల అవుతుందని కన్ఫర్మ్ చేశారు. సో ఐమాక్స్ వెర్షన్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నవారికి డిజప్పాయింటింగ్ వార్తే అని చెప్పాలి. ఇక ఈ జూలై 30 రిలీజ్ కి అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ రేపు జూన్ 17న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఓపెన్ కానున్నాయి.



