రేపటి నుండి డిస్కోరాజా షూటింగ్ ప్రారంభం !

Published on Mar 4, 2019 11:37 am IST

అమర్ అక్బర్ ఆంటొని తరువాత మాస్ రాజా రవితేజ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ రోజు ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేశారు. రేపటి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనున్నారు.

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై నేల టికెట్టు నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల హ్యాట్రిక్ డిసాస్టర్ లను ఖాతాలో వేసుకున్న రవితేజ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More