‘డిస్కో రాజా’ కృష్ణ జిల్లా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 28, 2020 9:35 am IST

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. మొదటి రోజు పర్వాలేదనిపించుకునే కలెక్షన్స్ తో ఈ సినిమా మొదలైనా, రెండో రోజుకే కలెక్షన్స్ తగ్గిపోయాయి. కాగా కృష్ణ జిల్లాలో ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే.. 4వ రోజుగానూ ఈ సినిమాకి రూ. 1,13,258 లక్షల షేర్ వచ్చింది. ఇప్పటివరకూ కృష్ణ జిల్లాలో రూ. 39,78,788 లక్షల షేర్ ను ఈ సినిమా వసూళ్లు చేసింది. రవితేజ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ చాల తక్కువే అని చెప్పాలి.

అయితే రవితేజ తన ఆటిట్యూడ్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా సినిమాలో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ దర్శకుడు ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోకపోవడం, పైగా డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ అండ్ రవితేజ రెండు పాత్రల మధ్య ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం వంటి అంశాలు సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. దాంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. మరి డిస్కో రాజా రాబోయే రోజుల్లో ఎంతవరకు కలెక్షన్స్ ను రాబడతాడో చూడాలి. ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More