డిస్కోరాజా షూటింగ్ అప్డేట్ !

Published on Feb 10, 2019 6:00 pm IST


గత ఏడాది మాస్ రాజా రవితేజ కు ఎంత మాత్రం కలిసి రాలేదు. ఆ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన రవితేజ కు అందులో ఒక్క చిత్రం కూడా విజయాన్ని అందిచలేకపోయింది. దాంతో తన తదుపరి చిత్రం తో ఎలాగైనా విజయం సాధించాలని స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించనున్నాడు. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనున్నారు. ఇక వీరితో పాటు మరో హీరోయిన్ కు కూడా స్కోప్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆ హీరోయిన్ పేరును ను ఖరారు చేయనున్నారు.

ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి 4 నుండి హైదరాబాద్ లో జరుగనుంది. రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :