ఎవరితో పెట్టుకోకూడదో,వారితోనే పెట్టుకున్న కంగనా.

Published on Jul 11, 2019 1:26 pm IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చర్యలు ఆమె నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఆమె ఇటీవల జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారి పెద్ద వివాదానికి దారితీసేలా ఉన్నాయి.కంగనా ,రాజ్ కుమార్ రావ్ హీరోగా ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన ‘మెంటల్ హై క్యా’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో కంగన , ‘మణికర్ణిక’ చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో కంగన బహింరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.క్షమాపణ చెప్పేవరకు ఆమెకు మీడియా కవరేజ్ చేయమని ‘ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ క్షమాపణ చెప్పింది. కంగానా మాత్రం క్షమాపణ చెప్పేది లేదని మొండి పట్టుపట్టారు. అంతేకాకుండా ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు, నాపేరు వాడుకొని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు నాకు మీడియా కవరేజ్ ఇవ్వదంటూ, వీడియోను విడుదల చేసింది. దీనితో జర్నలిస్టులు ఈ వివాదాన్ని ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు బాలీవుడ్ లో ప్రముఖ హీరోలతో,నిర్మాతలతో, దర్శకులతో గొడవలుపడ్డ కంగనా ఈసారి జర్నలిస్టులతో పెట్టుకొని అనవసరంగా సమస్యలు తెచ్చిపెట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More