విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ‘ఆదర్శ కుటుంబం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా పవర్‌ఫుల్ నెగటివ్ రోల్‌తో మెప్పించిన దివ్యేందు.. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పాత్రను దక్కించుకున్నాడట. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెంకీ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాబోయే దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘పెద్ది’ సక్సెస్ తర్వాత టాలీవుడ్‌లో దివ్యేందు శర్మకు వరుస ఛాన్స్‌లు దక్కుతుండటం విశేషం. మరి ‘ఆదర్శ కుటుంబం’ దివ్యేందు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.


