కోవిడ్ కారణం గా వాయిదా పడిన “డీజే టిల్లు”

Published on Jan 10, 2022 7:02 pm IST

సిద్ధు, నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం డీజే టిల్లు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మరియు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం జనవరి నెలలో విడుదల కావాల్సి ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కారణం గా సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం సరికొత్త విడుదల తేదిను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :