నాగ్, సమంత కు ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా !

Published on Jul 23, 2018 11:37 am IST

ఈ ఏడాది వరుస విజయాలను సాధిస్తూ తెలుగు , తమిళ భాషల్లో అగ్ర తార గా దూసుకుపోతున్నారు నటి సమంత అక్కినేని. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘యు టర్న్’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆమె అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించారు.

ఈ సంధర్బంగా మీకు మీ మావయ్య నాగార్జున గారు ఇచ్చిన అతిపెద్ద బహుమతి ఏది అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు చైతు తో పెళ్లి కి అగీకరించడమే ఆయన నాకు ఇఛ్చిన పెద్ద బహుమతి అని సమంత రిప్లై ఇచ్చారు.

ఆలాగే నాగార్జున గారు నాకొక ఇన్స్పిరేషన్ అని త్వరలోనే నేను నటించే చిత్రాల గురించి తెలియజేస్తానని ఆమె అన్నారు. ఇక పెళ్లి తరువాత చైతు, సమంత కలిసి నటిస్తున్న నూతన చిత్రం ఈ రోజు నాగ్ చేతులమీదుగా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ‘నిన్ను కోరి’ ఫెమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :