విజయ్ సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న బాల అబిమాని..!

Published on Jul 9, 2021 12:02 am IST


సినిమా హీరోలపై ఫ్యాన్స్‌కు ఉండే అభిమానం ఎలాంటిదో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడినైనా పూజిస్తారో లేదో తెలీదు కానీ అంతకంటే ఎక్కువగానే తమ అభిమాన హీరోను ఆరాధిస్తుంటారు. అయితే తన అభిమాన హీరో సినిమా చూస్తూ ఓ బాల అభిమాని చికిత్స చేయించుకోవడం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే చెన్నైలోని మైలాపూర్‌కు చెందిన శశి అనే పదేళ్ల బాలుడు తన మేనమామతో బైక్‌పై వెళుతూ కిందపడ్డాడు.

దీంతో ఆ బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో రాయ్‌పేటలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే సర్జరీ చేయాల్సి రావడంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు వైద్యులు ప్రయత్నించగా అందుకు బాలుడు మారం చేస్తూ నిరాకరించాడు. దీంతో కాసేపు తలలు పట్టుకున్న వైద్యులు ఆ బాలుడికి ఏ హీరో అంటే ఇష్టమో అడిగి తెలుసుకున్నారు. ఆ బాలుడు హీరో విజయ్‌ అంటే ఇష్టమని చెప్పడంతో ఫోన్‌లో విజయ్ నటించిన బిగిల్‌ (తెలుగులో విజిల్) సినిమా పెట్టించి ఇచ్చారు. తన అభిమాన హీరో సినిమాలో బాలుడు నిమగ్నమవ్వడంతో వైద్యులు తేలికగా చికిత్స పూర్తి చేసేశారు.

సంబంధిత సమాచారం :