సాయి పల్లవి ఆ సినిమాకు నో చెప్పిందా ?

Published on Dec 2, 2018 10:21 pm IST

గుర్తింపు ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ సెలెక్టివ్ గా సినిమాలను చేసుకుంటూ వెళుతుంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి. ఇక ఆమె తాజాగా ఒక సినిమాకు నో చెప్పిందని సమాచారం. ‘ఉయ్యాలా జంపాల , మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మ, కళ్యాణ్ రామ్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితే బాగుంటుందని ఆమె కు ఈ కథ చెప్పాడట. తన పాత్రకు పెద్దగా గుర్తింపు లేదని భావించిన సాయి పల్లవి ఈ ఆఫర్ ను తిరస్కరించిందట. ఈ చిత్రం కూడా ప్రేమ కథ నేపథ్యంలోనే తెరకెక్కనుంది. మరి ఈసినిమాలో హీరోయిన్ అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి.

ఇక సాయి పల్లవి తెలుగులో ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం ఈనెల 21న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :