వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘దూరదర్శిని’.. మే 15న విడుదల

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘దూరదర్శిని’.. మే 15న విడుదల

Published on Apr 29, 2026 6:00 AM IST

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’ (కలిపింది ఇద్దరిని). సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ‘చిత్రలహరి మీట్’ పేరిట సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కనిపించిన ఒక యాచకుడి నిజ జీవిత కథే ఈ సినిమా అని తెలిపారు. సొంత కొడుకు వల్లే ఆయనకు బిక్షాటన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనే భావోద్వేగాల చుట్టూ కథ నడుస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఈ సినిమా ఉంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

దర్శకుడు కార్తికేయ, నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదని, 90వ దశకం నాటి జ్ఞాపకాలను, పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేసే చిత్రమని చెప్పారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన అనుభూతిని పంచుతుందని హీరోయిన్ గీతిక, లావణ్య రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు