రెట్టింపు బడ్జెట్‌తో బిగ్‌బాస్-5 ప్లాన్?

Published on Jul 8, 2021 1:11 am IST

తెలుగు రియాలిటీ షోలలో అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులారిటీ, అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రోగ్రాం బిగ్‌బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్‌పుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టబోతుంది. అయితే మునుపటి సీజన్స్‌ కంటే బిగ్‌బాస్‌-4 టీఆర్పీతో పాటు మంచి పాపులరిటీనీ సంపాదించుకుందన్న సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ సీజన్-5ని కూడా నిర్వాహకులు అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

గత సీజన్ల బడ్జెట్ కంటే ఈ సారి సీజన్‌కు బడ్జెట్‌ను రెట్టింపు చేసి వినూత్న రీతిలో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ సారి పెద్ద సెలబ్రెటీలను హౌస్‌లోకి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్‌లో కంటెస్టంట్లతో చేయించే టాస్క్‌లను కూడా కాస్త విభిన్నంగా ఉండేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఇంత హైప్ క్రియేట్ అవుతున్న ఈ సీజన్ వీలైనంత త్వరగా ప్రారంభమై ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్ అందించాలని మనమంతా ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :