డబుల్ ఎనర్జీ తో “డబుల్ ఇస్మార్ట్” సెకండ్ షెడ్యూల్!

ram 1

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. పూరీ కనెక్ట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబందించిన థాయిలాండ్ లో షూటింగ్ ప్యాక్ అప్ అయ్యింది. ఇదే విషయాన్ని వెల్లడించడానికి మేకర్స్ ఒక ఫోటో ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం లో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సంజయ్ దత్, హీరో రామ్, పూరి జగన్నాథ్, ఛార్మి లు కలిసి ఉన్న ఫోటో ను షేర్ చేశారు మేకర్స్. డబుల్ ఎనర్జీ తో ఈ డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చ్ 8, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version